Breaking News : నారా లోకేష్ కి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ నోటీస్..!

-

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత 10 రోజుల నుంచి ఢిల్లీలో ఉంటున్నాడు. ఇటీవలే యువగళం పాదయాత్రను వాయిదా వేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ తో నారా లోకేష్ ఢిల్లీలో లాయర్లను సంప్రదించి.. పలు విషయాల గురించి చర్చలు జరుపుతున్నారు. తాజాగా 41 ఏ కింద ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ 14గా ఉన్న లోకేష్ కి సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు.

 

అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు  విచారణకు రావాలని నోటీసులు పంపించారు. ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో లోకేష్ ను కలిసి నోటీసులు అందజేశారు సీఐడీ అధికారులు. నారా లోకేష్ కి నోటీసులు అందజేసేందుకు ఒకరోజు మందే ఢిల్లీకి వెళ్లి ఇవాళ నోటీసులు అందజేశారు. అంతకు ముందు 41 ఏ కింద నోటీసును వాట్సాప్ ద్వారా పంపించారు. తనకు నోటీసులు వాట్సాప్ ద్వారా అందాయని.. సీఐడీ అధికారులకు రిప్లై కూడా ఇచ్చారు నారా లోకేష్. ఒకవేళ అక్టోబర్ 4న ఏదైనా అనివార్య కారణాల రిత్యా నారా లోకేష్  హాజరుకాలేకపోతే ముందస్తుగా సమాచారం ఇవ్వాలి. మళ్లీ ఎప్పుడు విచారణ చేపట్టాలనేది నోటీసులు పంపిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news