Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు విడాకులు, మరోవపై మయోసైటిస్ వ్యాధి.. ఇలా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రముఖ నటి సమంత సినిమాలు, షూటింగుల నుంచి కొంత కాలం విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఏడాది నుంచి ఎలాంటి వర్క్ లేకుండా సైన్ చేసిన సినిమాలు కూడా రిటర్న్ చేసింది.
కొద్దిరోజులుగా వెకేషన్లకు వెళ్తూ రీఛార్జ్ అవుతోంది. ఇక ఇటీవలే వెకేషన్ నుంచి కూడా తిరిగొచ్చేసింది. మల్లి విదేశాలకు వెళ్ళింది సమంత. అయితే… తాజాగా దిగిన ఫోటోలను హీరోయిన్ సమంత ఇన్ స్టాలో షేర్ చేశారు. కాగా, సమంత బాలీవుడ్ లో ఫుల్ లెంత్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అదికూడా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు జోడీగా. పవన్ కళ్యాణ్తో పంజా సినిమాను తెరకెక్కించిన స్టైలీష్ డైరెక్టర్ విష్ణువర్ధన్తో..బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఓ భారీ సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.