6 డిగ్రీల చలిలో సమంత సాహసం.. ఫొటో వైరల్

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. మొన్నటిదాక ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న సామ్ తాజాగా ఇండోనేషియాలోని బాలి దీవికి విహారయాత్రకు వెళ్లింది. అక్కడ తన ఫ్రెండ్స్​తో హాలిడే జాలీగా ఎంజాయ్ చేస్తోంది. ఓవైపు ఎంజాయ్ చేస్తూనే మరోవైపు జిమ్​లో కసరత్తులు చేస్తూ శరీరాన్ని ఫిట్​గా ఉంచుకుంటోంది.

బాలిలో తన స్నేహితురాలు అనూషతో కలిసి సమయాన్ని గడుపుతూ చిల్ కొడుతోంది. వాటికి సంబంధించిన ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేస్తోంది. అలా అక్కడి అందాలను, అందమైన ప్రదేశాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్​ చేస్తోంది. తాజాగా ఆమె ఐస్ బాత్​​ టబ్​ అంటూ వీడియోను షేర్ చేసింది. ‘ఐస్ బాత్స్.. ఫోర్ డిగ్రీస్.. సిక్స్ మినిట్స్’ అంటూ.. ఆరు నిమిషాల పాటు ఆ ఐస్ నీళ్లలో కఠినంగా కూర్చొని ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఆమె కళ్ల నుంచి కన్నీళ్లు కూడా వస్తున్నట్టు కనిపించంది. అయితే ఇదొక థెరపీ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news