పుష్ప- 2లో మరోసారి స్టెప్పులు వేయనున్న సమంత..!

టాలీవుడ్‌ స్టార్‌ బన్నీ హీరో గా తెర‌కెక్కిన తాజా సినిమా పుష్ప‌. ఈ సినిమాను టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించ‌గా.. బ‌న్నీ స‌ర‌స‌న ర‌శ్మిక మందాన హీరోయిన్ గాన‌టించింది. అయితే.. ఈ సినిమా గతేడాది డిసెంబ‌ర్ 17 వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల అయింది. ఈ సినిమా పై పాజిటివ్ టాక్ రావ‌డంతో… జ‌నాలు ఎగ‌బ‌డి చూసారు.

అంతేకాదు… ఎవరూ ఊహించని కలెక్షన్లను కొల్లగొట్టింది పుష్ప. అయితే.. ఈ మూవీలో సమంత.. ఐటెం సాంగ్‌కు మంచి క్రేజ్‌ వచ్చింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం.. సమంత ఐటెం సాంగ్‌ లో నటించడంతో.. ఓ రేంజ్‌ రికార్డులను సృష్టించింది ఈ ఐటెం సాంగ్.

అయితే..ఈ ఊపునూ పుష్ప 2 లో కూడా కొనసాగించాలని సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. పుష్ప 2 లో కూడా.. సమంత కోసం ఓ కీ-రోల్‌ సృష్టించాడట. దాదాపు 30 నిమిషాల పాటు సమంత పుష్ప 2 లో కనిపించేలా స్కెచ్‌ వేసాడట సుక్కు. కాగా..ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.