Samantha: నెమలిగా మారిపోయిన సమంత..ఎందుకో తెలుసా?

-

నటనలోనే కాదు అందంలోనూ తగ్గేదెలే అంటోంది బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తన ప్రొఫెషనల్ కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టేసింది. సినిమాల కోసం బిజీ షెడ్యూల్స్‌తో ఖాళీ లేకుండా గడుపుతోంది.

ఇక సోషల్ మీడియాలో సమంత ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటోంది. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటోంది. లేటెస్టుగా ఇన్ స్టా గ్రామ్‌లో ఆలివ్ గ్రీన్ పీకాక్ డ్రెస్‌లో దిగిన ఫొటో పోస్ట్ చేసింది. ‘పీకాక్’ మ్యాగజైన్ కోసం సమంత నెమలి మాదిరిగా డ్రెస్సు ధరించి ఫోజులిచ్చింది. స్టన్నింగ్ లుక్స్‌తో ఉన్న ఈ ఫొటోను చూసి నెటిజన్లు ‘లుకింగ్ సో బ్యూటిఫుల్, గాడ్జియస్, క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే ఈ ఏడాది ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రంలో ‘‘ఊ అంటావా మావ ఊహు అంటావా మావ’’ అనే స్పెషల్ సాంగ్ చేసింది.

ఆ సాంగ్ తో కుర్రకారు ఉర్రూతలూగించిన సమంత..హరిశంకర్,హరి నారాయణ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘యశోద’లో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. సైన్స్, ఫిక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీలో సమంత ఫస్ట్ లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 12‌న విడుదల కానుంది.

https://www.instagram.com/p/CdNxrteLvvb/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news