న్యూయార్క్ వీధుల్లో బ్లాక్ శారీలో సమంత సోయగం.. ఫొటోలు వైరల్

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే బాలికి వెళ్లిన సామ్.. ఇప్పుడు న్యూయార్క్ వీధుల్లో తిరుగుతోంది. అయితే చికిత్స కోసం ఈ బ్యూటీ న్యూయార్క్​కు వెళ్లినట్లు సమాచారం. సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సామ్.. తాజాగా న్యూయార్క్ ఇండియా డే పరేడ్​లో పాల్గొంది. ఇక ఇప్పుడు ఫొటోషూట్స్​తో బిజీగా ఉంది.

అలా చేసిన ఫొటోషూట్స్​లో నుంచి తాజాగా కొన్ని ఫొటోలను నెట్టింట వదలింది. బ్లాక్ శారీలో సామ్ సూపర్ హాట్​గా కనిపిస్తోంది. పైటను కాస్త కిందకి లాగి సూపర్ హాట్ పోజులతో అదరగొట్టింది. ఈ ఫొటోలు చూసి కుర్రకారు గుండె బేజారై పోతోంది.

గత కొంతకాలంగా సామ్ ఎక్స్​పోజింగ్​కు సై అంటున్న విషయం తెలిసిందే. తన డ్రెస్సింగ్ స్టైల్​ను.. యాటిట్యూడ్​ను పూర్తిగా మార్చేసింది ఈ అమ్మడు. ఇక లేటెస్ట్ ఫొటోల్లోనూ ఓవైపు ఎద అందాలు.. మరోవైపు నడుం ఒంపులు చూపిస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. ఈ ఫొటోలు చూసి కొంతమంది నెటిగివ్​గా ట్రోల్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ కోసం వెళ్లి ఈ ఫొటోషూట్లేంటంటూ కామెంట్లతో ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news