ప్రస్తుతం సమంత రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉంటూ కొన్ని నెలల పాటు విశ్రాంతికి పూనుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు తన ఆరోగ్యం మీదే పూర్తి ఫోకస్ పెట్టింది. సంపూర్ణ ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఎన్నో ప్రయోగాలు చేస్తోంది. ఇక తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేసుకుని మొత్తంగా తన ఆరోగ్యం పై ఫోకస్ పెట్టింది సమంత.
అలా ఎంతో కష్టపడి డైట్ మెయింటైన్ చేస్తూ వచ్చినట్లు తెలుస్తోంది. ఏడాదిపాటు ఆహారం విషయంలో ఎంతో కఠినంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే సమంత తాజా పోస్ట్ చూస్తే ఆమె ఫుడ్ విషయంలో ఎంతో కష్టపడుతుందని అర్థం అవుతోంది. సామ్ పెట్టిన తాజా పోస్ట్ ప్రకారం….’16 నెలలుగా ఈ బ్రెడ్ ముక్కను ముట్టలేదు. ఫైనల్ గా ఇప్పుడు తింటున్నా’ అంటూ చెప్పుకొచ్చింది తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ పోస్ట్ పెట్టడంతో… పాపం ఎంత కష్టం వచ్చిందో సామ్ కి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.