నా లైఫ్​లో ఈరోజు చాలా స్పెషల్ : సమంత

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ఓవైపు ఖుషి సినిమా.. ఇంకోవైపు సిటడెల్ వెబ్​సిరీస్​ షూటింగులతో బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్​గా ఉంటోంది. తాజాగా ఈ బ్యూటీ సిటడెల్ వెబ్ సిరీస్​కు సంబంధించి ఓ అప్డేట్​ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే..?

ఈ పోస్టులో బ్లాక్​ డ్రెస్సులో ఉన్న తన సెల్ఫీని యాడ్ చేసింది సమంత. అనంతరం క్యాప్షన్​ జత చేస్తూ.. ‘‘జులై 13 నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజుతో ‘సిటడెల్‌’ వెబ్‌సిరీస్‌ పూర్తయింది’’ అని అసలు విషయం చెప్పుకొచ్చింది. ఇక ఈ సిరీస్ తర్వాత సామ్ ఏడాది వరకు ఏ సినిమాలు చేయకుండా కాస్త గ్యాప్ తీసుకోనుందనే వార్త కొన్నిరోజులుగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే త్వరలోనే ఖుషి మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్స్​లో సమంత పాల్గొంటుందా లేదా అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఇక సిటడెల్ విషయానికొస్తే.. దీని ఇండియన్‌ వెర్షన్‌లో వరుణ్‌ ధావన్‌, సమంత ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్‌, డీకే దర్శకత్వంలో ఇది రూపొందింది.

Read more RELATED
Recommended to you

Latest news