ఫ్యాన్స్ కు సమంత బర్త్ డే సర్ప్రైజ్.. కొత్త మూవీ అనౌన్స్మెంట్

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సామ్కు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖులు, అభిమానులు ఈ భామకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే తన జన్మదినోత్సవం రోజునే సమంత అభిమానులకు ఓ సూపర్ సర్ప్రైజ్ ఇచ్చింది. బర్త్ డే గిఫ్ట్గా తన అభిమానుల కోసం సామ్ తన కొత్త మూవీ గురించి అనౌన్స్మెంట్ ఇచ్చింది. మా ఇంటి బంగారం అనే టైటిల్తో ఈ సినిమా వస్తున్నట్లు చెప్పింది.

తన కొత్త చిత్రానికి సంబంధించి సమంత ఓ పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సామ్ సొంత ప్రొడక్షన్ హౌస్ అయిన ట్రా లాలా ఈ మూవీని తెరకెక్కించనుంది. ఈ పోస్టర్లో సామ్ చీర కట్టుకుని ఓ గృహిణిగా కనిపించింది. ఆమె చేతిలో గన్ కూడా పట్టుకుని కాస్త వైలెంట్గానూ కనిపించింది. ముఖం మీద రక్తం మరకలు కూడా ఉన్నాయి. ఈ పోస్టర్ చూస్తుంటే మరోసారి సామ్ను యాక్షన్ మోడ్లో చూడబోతున్నట్లు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Read more RELATED
Recommended to you

Latest news