ఏంటి సమంత.. నీకు పెళ్లయిందన్న విషయం మరిచిపోయావా?

-

సమంత మీద ఇప్పటి వరకు ఎటువంటి గాసిప్స్ రాలేదు. చైతన్యతో డేట్ చేసి తర్వాత ఆయన్నే పెళ్లి చేసుకొని చక్కగా అక్కినేని కోడలుగా సెటిల్ అయిన సమంత పెళ్లి తర్వాత ఎందుకో కాస్త బోల్డ్ నెస్ కు ఇష్టపడుతుందా? అని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.

సమంత.. సామ్.. గోల్డెన్ లెగ్. ఎక్కడ లెగ్ పెట్టినా బంగారమే. మొదటి సినిమాతోనే క్రేజీ హీరోయిన్ అనిపించుకున్న సమంత… పెళ్లి తర్వాత కూడా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ హోదాను అనుభవిస్తోంది. అది సమంత టాలెంట్ అంటే. ఇప్పటికీ వైవిద్యమైన పాత్రల్లో మెరుస్తూనే ఉన్నది.

అయితే.. సమంత మీద ఇప్పటి వరకు ఎటువంటి గాసిప్స్ రాలేదు. చైతన్యతో డేట్ చేసి తర్వాత ఆయన్నే పెళ్లి చేసుకొని చక్కగా అక్కినేని కోడలుగా సెటిల్ అయిన సమంత పెళ్లి తర్వాత ఎందుకో కాస్త బోల్డ్ నెస్ కు ఇష్టపడుతుందా? అని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.

పెళ్లికి ముందు కాస్త పద్ధతిగానే ఉన్న సామ్.. పెళ్లి తర్వాత హాట్ ఫోటోషూట్ లలో నటించడం, బాడీ కనిపించేలా డ్రెస్సులు వేసుకొని నెటిజన్ల ఆగ్రహానికి గురవడం చాలా సార్లు జరిగింది. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో అప్పుడప్పుడు కాస్త బోల్డ్ గా ఉన్న ఫోటోలను అప్ చేస్తుంటుంది సమంత.

తాజాగా.. అటువంటిదే మరో ఫోటోను షేర్ చేసి నెటిజన్లతో అక్షింతలు వేయించుకుంది. హాఫ్ ఫేస్ కనిపించేలా.. బాడీ ఫుల్ గా కనిపించేలా ఓ ఫోటోను షేర్ చేసింది. సమంత వేసుకున్న షర్ట్ కు బటన్స్ కూడా లేవు. మొత్తానికి అది మోడ్రన్, బోల్డ్ లుక్. ఆ ఫోటోపై నెటిజన్లు కాస్త నెగెటివ్ గానే స్పందించారు.

సమంత.. నీకు పెళ్లయిందన్న విషయాన్ని మరిచిపోయావా? నువ్వు అక్కినేని ఇంటి కోడలివి. కాస్త పద్ధతిగా ఉండు.. అంటూ హితభోద చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version