అస్వస్థకు గురైన సమంత.. హాస్పిటల్ లో చేరిక..!

-

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందంతో అందమైన చిరునవ్వుతో ఎంతటి వారినైనా సరే ఇట్టే ఆకట్టుకుంటుంది. అందుకే అటు టాలీవుడ్ లోనే కాదు ఇటు బాలీవుడ్ లో కూడా సమంతకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా ఆమె కీలక పాత్ర పోషిస్తున్న శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

అయితే సమంత విశ్రాంతి లేకుండా ప్రమోషన్స్ లో బిజీగా కొనసాగడం వల్ల తాజాగా తీవ్ర అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని సమంతా తన ట్వీట్ లో పేర్కొంది. తీవ్రమైన జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న సందర్భంగా మీకు దూరంగా ఉండాల్సి రావడం మరింత ఇబ్బంది పెడుతోంది అంటూ తన ట్వీట్ లో పేర్కొంది సమంత. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇకపోతే సమంత విషయానికి వస్తే.. తెలుగులో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న ఈమె తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ను ఏర్పాటు చేసుకుంది.

ఒకవైపు హీరోయిన్ గా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటూనే.. మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇకపోతే ఇటీవల యశోద సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సమంత ఇప్పుడు శాకుంతలం సినిమాపై తన ఆశలన్నీ పెట్టుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కావడం గమనార్హం. అంతేకాదు ఈ సినిమా కోసం సమంత ఏకంగా మూడు సంవత్సరాల తన సమయాన్ని కేటాయించింది. ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ అవ్వాలని అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...