క్యాలీ ఫ్ల‌వ‌ర్ గా వ‌స్తున్న సంపూ ! పోస్ట‌ర్ విడుద‌ల‌

-

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరో గా వ‌స్తున్న సినిమా క్యాలీ ఫ్ల‌వ‌ర్. హీరోయిన్ గా వాసంతి న‌టిస్తుంది. తాజా గా ఈ సినిమా కు సంబంధించిన రెండు పోస్ట‌ర్ల‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్స్ లో మ‌గాడి దీ శీల‌మేగా అనే క్యాప్ష‌న్ తో విడుద‌ల చేశారు. ఈ సినిమా లో బ‌ర్నంగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఆడ‌వారిదే శీల‌మా.. మగాడి దీ శీలం కాదా ? అని ప్ర‌శ్నించేలా ఉంటుంద‌ని తెలుస్తుంది.

అలాగే శీలో ర‌క్ష‌తి ర‌క్షితః అనే ఉప శిర్షీక ఈ సినిమా ఉంటుంది. అయితే ఈ సినిమా ను న‌వంబ‌ర్ 25 న థీయేట‌ర్ల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. అయితే ఈ సినిమా మంచి కామెడీ యాక్ష‌న్ గా రానుంది. ఈ సినిమా లో పోసాని కృష్ణ ముర‌ళి, పృధ్వీ, నాగ మ‌హేష్, గెట‌ప్ శ్రీ‌ను, రోహిని తో పాటు కాదంబ‌రి కిర‌ణ్ ముఖ్య మైన పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. అలాగే ఈ సినిమా కు ఆర్కె మాలినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అలాగే ఆశా జ్యోతి గోగినేని ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news