“వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ ” లో టీటీడీకి స్థానం:

-

దేశంలోనే అత్యంత ధనవంతమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ అరుదైన గౌరవం లభించింది. తిరుమల శ్రీవారి దేవాలయానికి ఇంగ్లాండ్ కు చెందిన… వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సర్టిఫికేట్ ను అందించింది. ఏ ఆలయం లో లేనివిధంగా భక్తులకు సేవలు అందించినందుకు గాను ఈ సర్టిఫికెట్ అందించింది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ.

ఈ మేరకు ఇవాళ సాయంత్రం తిరుమల సన్నిధిలో.. టీటీడీ పాలక మండలి నూతన అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డికి ఆ సంస్థ ఇండియా యక్షుడు సంతోష్ శుక్ల తరఫున దక్షిణ భారతదేశ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజి ఈ సర్టిఫికెట్ ను అందజేశారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ… దేశంలోని అత్యంత ధనవంతమైన శ్రీవారి దేవాలయానికి ఈ గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. దేశంలో ఏ దేవాలయానికి లేని గొప్పతనం తిరుమల దేవస్థానానికి ఉందని… తరచూ వేల సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పారు. సాధారణ రోజుల్లోనే శ్రీవారి సన్నిధికి డెబ్బై వేల మందికి పైగా భక్తులు వస్తారని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టిటిడి పాలకమండలి వెల్లడించారు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news