హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవమానకర రీతిలో ఓడిపోవడంతో ఆ పార్టీ నేతల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది. నేడు ఢిల్లీ వేదిక గా జరిగిన హుజూరాబాద్ రివ్యూ సమావేశంలో కూడా నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా రివ్యూ సమావేశానికి పిలవనందుకు జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు. తనను ఎందుకు పిలవలేదంటూ సోనియాకు, రాహుల్ గాంధీకి లేఖాస్త్రం సంధించారు.
ఇవాళ్టి సమావేశంపై తనకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. కరీంనగర్ ఇంఛార్జ్ గా ఉన్న తనను సమావేశానికి పిలవక పోవడం బాధ కలిగించిందన్నారు జగ్గారెడ్డి. హుజూరాబాద్ ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థిని నియమించలేదని ప్రశ్నించారు. బల్మూరి వెంకట్ దగ్గర డబ్బు లేదన్నా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని లేఖలో విమర్శించారు. నామినేషన్ల ముందు రోజు అభ్యర్థిని నియమిస్తారా.. అని టీ కాంగ్రెస్ తీరును ప్రశ్నించారు జగ్గారెడ్డి. హై కమాండ్ ద్రుష్టికి హుజూరాబాద్ ఓటమికి కారణమైన అంశాలను తీసుకెళ్ల లేకపోయానని అన్నారు జగ్గారెడ్డి.