తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గోల్డెన్ లెగ్ మాత్రమే కాదు ప్లాటినం లెగ్ అనిపించుకున్న ఏకైక హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మలయాళీ ముద్దుగుమ్మ అయిన ఈమె తెలుగులో భీమ్లా నాయక్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తర్వాత బింబిసారా, సార్ వంటి చిత్రాలలో నటించి మళ్లీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈమె ఇటీవల సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్షా సినిమాలో కూడా నటించి మరొకసారి విజయాన్ని సొంతం చేసుకుంది.
గతంలో ఐరన్ లెగ్ అంటూ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కథల ఎంపిక విషయంలో పర్ఫెక్ట్ అని నిరూపించుకోవడమే కాదు అందరి చేత ప్లాటినం లెగ్ అని పిలిపించుకుంటోంది. రాబోయే సినిమాలకు కూడా ఇదే సక్సెస్ ఫామ్ కొనసాగించాలని ప్రయత్నం చేస్తుంది . అందులో భాగంగానే తాజాగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈమె తన వ్యక్తిగత విషయాలను కూడా మీడియాతో పంచుకుంది.. సంయుక్త మాట్లాడుతూ.. తనకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అని ..అందుకే ఎక్కువగా ఒంటరిగానే విహారయాత్రలు చేస్తూ ఉంటానని తెలిపింది. అంతేకాదు తన వీపు పైన ట్రావెలర్ ఐ ట్యాటూ కూడా వేయించుకున్నానని చెప్పింది.
మరొకవైపు మంచి కవితలు కూడా రాసే టాలెంట్ ఉందట.. కాలేజ్ డేస్ లోనే తన ఫోటో ఫేస్బుక్లో చూసి ఒక డైరెక్టర్ ఆఫర్ ఇచ్చారని ముందు సరదాగే సినిమా చేసినా.. ఇప్పుడు సినిమాలంటేనే ఆసక్తి పెరిగింది అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా ఇన్ని వరుస విజయాలు అందుకోలేదు. ఆ ఒక్క రికార్డు కేవలం ఈమెకు మాత్రమే సాధ్యం అన్నట్టుగా నిరూపిస్తోంది.