ఆ నలుగురితో సందీప్ రెడ్డి వంగా ‘సినిమాటిక్ యూనివర్స్’!

-

‘యానిమల్‌’ మూవీతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజాగా చెన్నైలో ఓ అవార్డు వేదికకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సినిమాటిక్ యూనివర్స్పై స్పందించారు. షోలో యాంకర్.. విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్, రణ్బీర్ కపూర్, ప్రభాస్ (అర్జున్‌ రెడ్డి- విజయ్‌; కబీర్‌ సింగ్‌- షాహిద్‌; యానిమల్‌- రణ్‌బీర్‌; స్పిరిట్ – ప్రభాస్)తో కలిసి సినిమాటిక్ యూనివర్స్‌ ప్లాన్‌ చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని సందీప్ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ఏదైనా మంచి పాయింట్‌ మదిలో మెదిలితే కచ్చితంగా చేస్తానని తెలిపారు. ‘యానిమల్‌’లోని హీరో పాత్రకు ఏ తమిళ నటుడు సూట్‌ అవుతారని అడగ్గా సూర్య అని సందీప్ రెడ్డి తెలిపారు. ‘యానిమల్‌’ సీక్వెల్‌ని 2026లో ప్రారంభిస్తామని చెప్పారు.

సినిమాటిక్ యూనివర్స్ అంటే ఏంటి ? : కథ ఎక్కడ ఆగిందో.. అక్కడ నుంచి మళ్లీ మొదలయ్యేది కొనసాగింపు చిత్రం. కథలతో సంబంధం లేకుండా ఆయా కథల ప్రపంచాన్నో, పాత్రల్నో కొనసాగిస్తూ సినిమాల్ని రూపొందించడాన్ని సినిమాటిక్‌ యూనివర్స్‌ అంటారు. కోలీవుడ్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ ఈ కాన్సెప్ట్‌కు నాంది పలికగా.. టాలీవుడ్‌లోనూ అలాంటి ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news