‘డబుల్ ఇస్మార్ట్​’లో విలన్​గా బాలీవుడ్ స్టార్.. అప్డేట్ అదిరిపోయిందిగా

-

చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని ఊరమాస్ క్యారెక్టర్​తో మెప్పించిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా వసూళ్లలో.. రికార్డులు బద్ధలు కొట్టిన విషయం తెలిసిందే. రామ్ కెరీర్​లోనే బ్లాక్ బస్టర్​గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్​గా డబుల్ ఇస్మార్ట్​గా వస్తున్నాడు రామ్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో రామ్​తో ఫైట్ చేసే విలన్​గా బాలీవుడ్ యాక్టర్​ను దింపుతారని గతకొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఆ ప్రచారాన్నే నిజం చేస్తూ మూవీటీమ్​ పవర్​ఫుల్​ అప్డేట్ ఇచ్చింది.

బాలీవుడ్ స్టార్ యాక్టర్​ సంజయ్ ​దత్ ఈ సినిమాలో​ బిగ్​బుల్​ అనే పాత్రలో కనిపించనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. డబుల్ ఇస్మార్ట్​ ఇప్పుడు డబుల్​ మాస్​ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. విలన్​ అనే విషయాన్ని చెప్పలేదు. కానీ ఇప్పటికే సంజయ్​ దత్​ ‘కేజీయఫ్’​ సిరీస్​లో పవర్​ఫుల్​గా విలన్​గా కనిపించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాబట్టి ఈ డబుల్ ఇస్మార్ట్​లో ఆయనే విలన్ అని అర్థమవుతోంది. ఇకపోతే ఈ కొత్త పోస్టర్​లో సంజయ్​ దత్​ లుక్​ అదిరిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news