శుభమన్ గిల్​తో డేటింగ్.. బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ క్లారిటీ

-

ఇండియన్ స్టార్ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్​తో బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ డేటింగ్‌ చేస్తుందంటూ కొన్నాళ్ల క్రితం వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై ఈ జంట క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు శుభమన్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్​తో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ ఇద్దరూ కలిసి కనిపించడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. అయితే మొదటగా శుభమన్​ సచిన కూతురు సారాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చినా.. మధ్యలో వీరిమధ్య భేదాభిప్రాయాలతో విడిపోయారని.. ఆ తర్వాత శుభమన్-సారా అలీఖాన్ ఓ హోటల్​లో కలిసి భోజనం చేస్తూ కనిపించడంతో ఆ సారాను మర్చిపోలేక ఈ సారాతో డేటింగ్​ చేస్తున్నాడంటూ రూమర్స్ వచ్చాయి.

అయితే తాజాగా సారా అలీఖాన్ ఈ రూమర్స్​పై క్లారిటీ ఇచ్చింది. కాఫీ విత్ కరణ్​ షోలో పాల్గొన్న సారా.. శుభమన్​తో డేటింగ్ చేస్తున్న సారా తాను కాదని అసలు సంగతి చెప్పుకొచ్చింది. ‘‘సారా అనగానే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ ప్రపంచం మొత్తం రాంగ్‌ సారా వెనుక పడుతోంది’’ అని తెలిపింది. సారా అలీఖాన్‌ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. శుభ్‌మన్‌తో తాను ప్రేమలో లేనట్టు చెబుతూనే.. సచిన్ కుమార్తె సారా – గిల్‌ రిలేషన్‌లో ఉన్నారంటూ సారా హింట్ ఇచ్చిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news