దుమ్ములేపుతున్న సారంగ‌ద‌రియా… మ‌రో రికార్డు

దాని కుడి భుజం మీద క‌డ‌వా.. దాని కుత్తెపు రైక‌లు మెరియా.. అది ర‌మ్మంటే రాదురా చెలియా.. దాని పేరే సారంగ‌ద‌రియా.. అంటూ యూట్యూబ్ లో దుమ్ములేపుతోంది ఈ పాట‌. ల‌వ్ స్టోరీ మూవీ నుంచి ఏ క్ష‌ణం అయితే రిలీజ్ చేశారో అప్ప‌టి నుంచి ట్రెండింగ్ లోనే ఉందంటే న‌మ్మండి. ఏ సోష‌ల్ మీడియా యాప్ లో చూసినా.. ఇదే వినిపిస్తోంది. అతి త‌క్కువ టైమ్ లోనే ఎక్కువ వ్యూస్ ద‌క్కించుకుంది.


మొద‌ట్లో దీనిపై కొన్ని వివాదాలు చెల‌రేగాయి. ఈ పాట త‌న‌ది అని కోమ‌లి మీడియా ముందుకు రావ‌డంతో మూవీ టీం ఇబ్బందులు ప‌డింది. కానీ లెజెండ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల కోమ‌లితో మాట్లాడి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాడు. దీంతో వివాదం ముగిసింది. ఇక శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలంటేనే మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇప్ప‌టికే చాలా సినిమాల్లో ఇది రుజువైంది. ఇక సారంగ‌ద‌రియా కూడా విజ‌య‌వంతంగా దూసుకుపోతోంది.

ఈ పాట‌కు నెమ‌లిలా డ్యాన్స్ చేసే సాయి ప‌ల్ల‌వి స్టెప్పులు వేయ‌డంతో పాట మ‌రో రేంజ్ లోకి వెళ్లింద‌నే చెప్పాలి. ఇప్ప‌టికే సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ పాట మ‌రో రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది. రీసెంట్ గా 150 మిలియన్ వ్యూస్ మార్క్ క్రాస్ చేసి సౌత్ ఇండియన్ మూవీస్ లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. చాలా త‌క్కువ టైమ్ లో ఇన్ని వ్యూస్ ద‌క్కించుకున్న పాట‌గా రికార్డు న‌మోదు చేసింది. ఇక ఈ మూవీ గత వారంలోనే విడుదల కావాలి.. కానీ కొవిడ్ సెకండ్ వేవ్ వల్ల వాయిదా వేశారు. అలాగే వచ్చే మే లో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. మ‌రి అప్ప‌టికి ప‌రిస్థ‌తి ఎలా ఉంటుందో చూడాలి.