కేంద్రం కొత్త స్కీం.. స్వామిత్వా యోజనా.. ప్రతిఒక్కరికీ ఇ-ప్రాపర్టీ కార్డు..!?

-

కేంద్ర ప్రభుత్వం నేడు కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలో నివసించే వారి ఆస్తుల వివరాలు, వివాదాలు పరిష్కరించేందుకు ఉపయోగపడుతుంది. స్వామిత్వా యోజనా పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం గ్రామస్తులకు వారి ఆస్తికి సంబంధించి ఇ-ప్రాపర్టీ కార్డును ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు దేశవ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా యజమానులకు ఇ-ప్రాపర్టీ కార్డును పంపిణీ చేయనున్నారు.

స్వామిత్వా యోజనా
స్వామిత్వా యోజనా

జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా స్వామిత్వా పథకం కింద ఇ-ప్రాపర్టీ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని పీఎంఓ కార్యాలయం ప్రకటించింది. కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ హాజరై కార్డు పంపిణీ చేస్తారు. అలాగే జాతీయ పంచాయతీ అవార్డు-2021 కూడా అందించడం జరుగుతుంది పీఎంఓ కార్యాలయం వెల్లడించింది. ఈ కొత్త స్కీంను ప్రారంభించడమే కాకుండా.. 224 గ్రామ పంచాయతీలకు దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సాధికారిత పురస్కారం, 30 గ్రామ పంచాయతీలకు నానాజీ దేశ్‌ముఖ్ జాతీయ గౌరవ్ గ్రామసభ అవార్డు, 29 గ్రామ పంచాయతీలకు వికాస్ యోజన పురస్కారం, 30 గ్రామ పంచాయతీలకు స్నేహపూర్వక గ్రామ పంచాయతీ అవార్డులు, అలాగే 12 రాష్ట్రాలకు ఇ-పంచాయతీ అవార్డులు అందజేయనున్నారు. అలాగే ఆయా గ్రామాలకు రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రైజ్ మనీ (గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో) ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వనున్నారు.

స్వామిత్వా యోజన అంటే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో చాలా మంది నివాస ఆస్తుల గురించి అధికారిక రికార్డులు లేవు. ఈ కారణంగా చాలా మందికి భూవివాదం జరుగుతూ ఉంటుంది. ఈ భూవివాదాలు పరిష్కరించడానికి, ఆస్తుల వివరాలను నమోదు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గతేడాది ఏప్రిల్ 24వ తేదీన యాజమాన్య పథకాన్ని ప్రారంభించింది. భూ వివరాలను డ్రోన్ సాయంతో మ్యాపింగ్, సర్వే నిర్వహిస్తారు. అన్ని వివరాలను ధ్రువీకరించిన తర్వాత ఇ-ప్రాపర్టీ కార్డు మంజూరు చేస్తారు. 2021-25 వరకు దేశవ్యాప్తంగా 6.62 లక్షల గ్రామాలకు ఇ-ప్రాపర్టీ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందని పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో సర్వే ఆఫ్ ఇండియా, ఆయా రాష్ట్రాల రెవెన్యూ విభాగం కలిసి పని చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news