BREAKING : బిగ్ బాస్ ఫేం, యూట్యూబ్ స్టార్ సరయూ అరెస్ట్

-

బాస్ బ్యూటీ, సెవెన్ హార్ట్ ఫేమ్ సరయు అరెస్ట్ అయ్యారు. కాసేపటి క్రితమే హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసులు… సెలబ్రిటీ సరయు ను అరెస్టు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఓ వీడియోలో నటించిందని ఫిర్యాదు అందడంతో ఆమెను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని.. హిందూ సంఘాల నేత అశోక్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. సరయు పై కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం అందుతోంది. సరయూ పై జీరో ఎఫ్ ఐ ఆర్… నమోదు చేసిన పోలీసులు… ఆమెను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం సెలబ్రిటీ సరయు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నట్లు సమాచారం అందుతోంది.ఈ కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version