సూర్య కోసం స‌త్య‌దేవ్ కొత్త అవ‌తారం!

-

త‌మిళ హీరో సూర్య కోసం యంగ్ హీరో స‌త్య‌దేవ్ కొత్త అవ‌తారం ఎత్త‌బోతున్నారు. `జ్యోతిలక్ష్మి`, బ్రోచే వారెవ‌రురా, ఉమా మ‌హేశ్వ‌ర ఉఉగ్ర రూప‌స్య వంటి విల‌క్ష‌ణ‌మైన చిత్రాల‌తో హీరోగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు స‌త్య‌దేవ్‌. ప్ర‌స్తుతం హీరోగా మూడు క్రేజీ చిత్రాల్లో న‌టిస్తున్నారు. వ‌రుస చిత్రాల‌తో బిజీగా వున్న ఆయ‌న హీరో సూర్య కోసం డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారుతున్నార‌ట‌.

హీరో సూర్య న‌టిస్తున్న తాజా చిత్రం `ఆకాశ‌మే నీహ‌ద్దురా`. త‌మిళంలో `సూరా‌రై పోట్రు` పేరుతో సుధ కొంగ‌ర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య న‌టిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ని సూర్య పాత్ర‌కు హీరో స‌త్య‌దేవ్ డ‌బ్బింగ్ చెబుతున్నార‌ట‌. ఇట‌వ‌ల తెలుగు వెర్ష‌న్‌కు సూర్య డ‌బ్బింగ్ చెప్పుకున్నారు. అయితే తెలుగు స్ప‌ష్టంగా రాక‌పోవ‌డంతో కొంత ఇబ్బందిక‌రంగా వుంద‌ట‌. దాంతో స‌త్య‌దేవ్ వాయిస్ న‌చ్చి అత‌ని చేత త‌న పాత్ర‌కు సూర్య డ‌బ్బింగ్ చెప్పించుకున్నార‌ట‌. ఈ మూవీ త్వ‌ర‌లోనే అమెజాన్ ప్రైమ్‌లో రీలీజ్ కాబోతోంది. ‌

Read more RELATED
Recommended to you

Latest news