కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారి వైరస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఎన్నో పరిశోధనలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఆయా పరిశోధనల్లో ఎన్నో సంచలన నిజాలు కూడా బయట పడుతున్నాయి. ఇటీవల అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి. 66 హాస్పిటల్లలో కరోనా వైరస్ బారినపడి చికిత్స తీసుకుంటున్న వృద్దులు యువకులను పరీక్షించగా… వృద్ధుల్లో గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తించారు పరిశోధకులు.
కరోనా వైరస్ బారినపడి తీవ్ర అస్వస్థతకు గురైన 80 ఏళ్లకు పైబడిన వారికి గుండెపోటు వస్తుందని ఆ తర్వాత కృత్రిమ శ్వాస అందించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అయితే మధ్యవయస్కులలో ఇలాంటి ప్రభావం ఉన్నప్పటికీ వారికి కృత్రిమ శ్వాస ద్వారా ప్రాణాలు నిలిపినట్లు తెలిపారు. అందుకే వృద్దులు వీలైనంత వరకు కరోనా వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తేప్రాణాలు కాపాడుకోవచ్చు అంటూ సూచిస్తున్నారు పరిశోధకులు.