దృశ్యం -2 ట్రైల‌ర్ విడుద‌ల! అద‌ర‌గొట్టిన వెంక‌టేష్

విక్ట‌రీ వెంక‌టేష్ , మీనా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వ‌చ్చిన సినిమా దృశ్యం -2. ఈ సినిమా ట్రైల‌ర్ ను కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ లో విక్ట‌రీ వెంక‌టేష్ అద‌ర కొట్టాడు. ఈ సినిమా కూడా దృశ్యం -1 లాగే థ్ర‌ల్లార్ జోన‌ర్ లో వ‌స్తుంది. ఈ సినిమా లో కూడా విక్ట‌రీ వెంక‌టేష్.. పోలీసు ల నుంచి త‌ప్పించు కోవ‌డానికి ప‌న్నాగాలు ర‌చిస్తున్న‌ట్టు ట్రైల‌ర్ ద్వారా తెలుస్తుంది. అయితే దృశ్యం పార్ట్ 1 లో వెంక‌టేష్ పెద్ద కూతురు ఒక కేసు లో చిక్కుకుంటుంది.

అయితే దృశ్యం -2 లో చిన్న కూత‌రు ఎస్తర్ అనిల్ కేసు లో చిక్కు కుంటున్న‌ట్టు ట్రైల‌ర్ ద్వారా తెలుస్తుంది. అయితే ఈ దృశ్యం -2 చిత్ర బృందం కాసేప‌టి క్రితం స‌మావేశం అయింది. ఈ స‌మావేశం లో నే ట్రైల‌ర్ ను విడుద‌ల చేయాల‌ని భావించారు. దీంతో ట్రైల‌ర్ అక‌స్మ‌తుగా విడుద‌ల చేశారు. అయితే ఈ దృశ్యం -2 సినిమా న‌వంబ‌ర్ 25 వ తేదిన అమెజ‌న్ ప్రైమ్ లో విడుద‌ల కానుంది. కాగా ఈ సినిమా ను మ‌ల‌యాళం దృశ్యం -2 నుంచి రిమేక్ చేశారు.