ఫ్రెంచ్ సినిమాలో అలనాటి తార రాధిక.. ఇన్​స్టాలో ఎమోషనల్ పోస్టు

-

టాలీవుడ్ సీనియర్ నటి రాధిక గురించి సౌత్ సినిమా ఇండస్ట్రీలో తెలియని వారుండరు. ఈ భామ ఓవైపు సినిమాలు.. మరోవైపు సీరియల్స్.. ఇంకోవైపు బుల్లితెరపై రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అయితే ఈ భామ ఇప్పుడు విదేశీ సినిమాల్లో తన ఎంట్రీ ఇచ్చింది. ఈ విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది రాధిక.

ప్రస్తుతం ఫ్రాన్స్​లో ఉన్న రాధిక.. ఫ్రెంచ్ సినిమాలో నటిస్తున్నట్లు తన పోస్టులో చెప్పుకొచ్చింది. ఈ సినిమా అనుభూతి గురించి షేర్ చేసుకుంది. ‘‘సినీ కెరీర్‌లో కొత్త ప్రయాణం మొదలైంది. ఫ్రెంచ్‌ సినిమాలో నటిస్తున్నాను. తొలి రోజు షూటింగ్‌లో పాల్గొన్నాను. కొత్త అనుభూతిని పొందనున్నా. ఈ విషయంలో నా భర్త శరత్‌కుమార్ ఎంతో ప్రోత్సహించారు’’ అంటూ శరత్​కుమార్​కు థ్యాంక్స్‌ చెప్పింది రాధిక. అలాగే షూటింగ్‌ సమయంలో దిగిన ఫొటోలను షేర్ చేసింది.

ఈ ఫొటోలు, పోస్టు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రియాంక చోప్రా వంటి యంగ్ హీరోయిన్లే కాదు.. రాధిక వంటి సీనియర్ హీరోయిన్లు కూడా గ్లోబల్​ రేంజ్​లో సినిమాలు చేయడం సంతోషకరంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా రాధికకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆల్ ది బెస్ట్ కూడా చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news