క‌ట‌క‌టాల వెన‌క్కి రాధికా శ‌ర‌త్ కుమార్

-

ఇటీవ‌లే ఓ ప‌బ్లిక్ స‌మావేశంలో విశాల్, శ‌ర‌త్ కుమార్ పై నోరు జారాడ‌ని ఆయ‌న కుమార్తె వ‌ర‌ల‌క్ష్మి అగ్గిమీద గుగ్గిలం అయింది. దీంతో వివాదం మ‌రింత ముదిరింది. తాజా ప‌రిస్థితుల‌ను విశాల్ త‌న వైపు కు తిప్పుకునే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు అంటున్నారు.

కోలీవుడ్ లో రాధికాశ‌ర‌త్ కుమార్ ల‌కు వివాదాలు కొత్తేం కాదు. నిత్యం ఏదో ఒక కాంట్రవ‌ర్శీతో వార్త‌ల్లో నిలుస్తారు. హీరో విశాల్ తో వ్య‌క్తిగ‌త వివాదాలు కార‌ణంగా భార్యాభ‌ర్త‌ల పేర్లు బాగా ఫోక‌స్ లోకి వ‌చ్చాయి. అప్ప‌టి నుంచి ఎంత చిన్న విష‌య‌మైనా భూత‌ద్దం పెట్టం చూడ‌టం మొద‌లైంది. తాజాగా ఓ చీటింగ్ కేసులో ఏకంగా క‌ట‌క‌టాల పాలైన విష‌యం కోలీవుడ్ స‌హా టాలీవుడ్ లో సంచ‌ల‌న‌మైంది. రెడియ‌న్స్ మీడియా సంస్థ‌కు న‌టుడు రాధికా శ‌ర‌త్ కుమార్, మ‌రో నిర్మాత లిస్టిన్ స్టీఫెన్ చెల్లించాల్సిన రెండు కోట్ల‌ను చెల్లించ‌క పోవ‌డంతో అరెస్ట్ చేయాల్సిందిగా చెన్నై సైదాపేట కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. గ‌తంలో ఈ ముగ్గురి కాంబినేష‌న్ లో కొన్ని చిత్రాలు తెర‌కెక్కాయ‌ట‌.

ఆ స‌మ‌యంలోనే రేడియ‌న్స్ సంస్త నుంచి అప్పుగా రెండు కోట్లు తీసుకుని చెల్లించే ప్రోస‌స్ లో చెక్ బౌన్స్ అయిందిట‌. త‌ర్వాత ఎన్నిసార్లు సంప్ర‌దించినా రేడియ‌న్స్ సంస్థ‌కు గానీ, కోర్టుకు గానీ స‌రైన స‌మాధం ఇవ్వ‌లేదుట‌. చివ‌రిగా కేసు శుక్ర‌వారం హియ‌రింగ్ కు రాగా ఆ రోజు కూడా గైహాజ‌ర‌య్యారుట‌. దీంతో ఆగ్ర‌హించిన కోర్టు నిబంధ‌న‌లు ప్ర‌కారం ఆరెస్ట్ చేయాల్సిందిగా ఉత్త‌ర్వులు ఇచ్చిందిట‌. కేసు తుద‌ప‌రి విచార‌ణ జులై 12 కి వాయిదా వేసారు. ఇప్ప‌టికే విశాల్ -శ‌ర‌త్ కుమార్ మ‌ధ్య బిగ్ వార్ న‌డుస్తోంది.

ఇటీవ‌లే ఓ ప‌బ్లిక్ స‌మావేశంలో విశాల్, శ‌ర‌త్ కుమార్ పై నోరు జారాడ‌ని ఆయ‌న కుమార్తె వ‌ర‌ల‌క్ష్మి అగ్గిమీద గుగ్గిలం అయింది. దీంతో వివాదం మ‌రింత ముదిరింది. తాజా ప‌రిస్థితుల‌ను విశాల్ త‌న వైపు కు తిప్పుకునే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు అంటున్నారు. న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల స‌మ‌యంలో విశాల్ ను సొంత వ‌ర్గం విబేధించిన టైమ్ లో శ‌ర‌త్ కుమార్ ఆ అవ‌కాశాలు త‌న‌వైపుకు తెలివిగా మ‌లుచుకున్నాడు. ఇప్పుడు అలాంటి ఛాన్స్ విశాల్ కు వ‌చ్చింది. మ‌రీ ఈవార్ కి ఎలాంటి ముగింపు ఉంటుందో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version