సమంత గత సినిమా యూ టర్న్ భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద చతికిల పడిన సంగతి తెలిసిందే. సమంత ఇమేజ్ ఏ మాత్రం సినిమాకు కలిసి రాలేదు. దీంతో నిర్మాతలకు నష్టాలు తప్పలేదు. అటు నందిని రెడ్డి ప్లాప్ ల్లో ఉంది.
అక్కినేని కోడలు సమంత `ఓ బేబి`లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. నందిని రెడ్డి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్ రూపమిది. జులై 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నిన్నటి రోజున హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, వెంకటేష్, రానా, నాగశౌర్యలు వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రాన్ని నలుగురు ఒకరికి ఒకరు పోటీ పడి మరీ ఆకాశానికి ఎత్తేసారు. బేబిగా సమంత అదరగొట్టింది. సినిమా మామూలుగా లేదు. సమంత కెరీర్ లో బెస్ట్ చిత్రం నిలుస్తుదడనంలో సందేహం లేదని వెకంటేష్ అన్నారు. సహజంగా వెంకటేష్ తను నటించిన సినిమాల గురించి గానీ, సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన సినిమాల గురించి వేదికలపై పెద్దగా మాట్లాడరు.
బయట సినిమాలు నచ్చాయంటే తెగ పొగిడేస్తారు. ఆ లెక్కన చూసుకుంటే ఓ బేబి సొంత సినిమా. కానీ ఆ చిత్రాన్ని పొగడటమే ఆశ్చర్యంగా అనిపించింది. ఇక మరో సొంత హీరో రానా కొత్త సినిమాలు తెలుగులో రావాలని ఎప్పుడూ అనుకుంటాను. ఓ బేబి లాంటి సినిమా ప్రతీవారం, ప్రతీ రోజు రావాలి. ఇలాంటి సినిమాలతో సురేష్ ప్రొడక్షన్స్ లో కొత్త శకం మొదలైందన్నారు. మరి ఇంతగా భజన చేయడానికి కారణం ఏంటి? అని ఆరా తీయగా ఆసక్తిర రూమర్ ఒకటి వినిపిస్తోంది. సమంతను తెలుగులో శిఖరానికి చేర్చాలన్నది ఒకటైతే….మరొకటి సినిమాకు బజ్ లేకపోవడం, నందిని రెడ్డి దర్శకురాలు కావడంతో పంపిణీదారులు, బయ్యటర్లు రాకపోవడం మరొక కారణంగా వినిపిస్తోంది.
సమంత గత సినిమా యూ టర్న్ భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద చతికిల పడిన సంగతి తెలిసిందే. సమంత ఇమేజ్ ఏ మాత్రం సినిమాకు కలిసి రాలేదు. దీంతో నిర్మాతలకు నష్టాలు తప్పలేదు. అటు నందిని రెడ్డి ప్లాప్ ల్లో ఉంది. గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ బేబిని కేవలం సురేష్ బాబు మీద నమ్మకంతోనే డిస్ర్టిబ్యూటర్లు, బయ్యర్లు రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారని వినిపిస్తోంది. సక్సెస్ పర్సంటేజ్ ఇస్తానన్న ఒప్పందంతోనే పంపిణీ దారులు ముందు కొచ్చారని అంటున్నారు. మరి ఓ బేబి సురేష్ బాబు నమ్మకాన్ని నిలబెడుతుందో లేదో? చూద్దాం.