మారుతీ-ప్రభాస్‌ సినిమాలో “మాళవిక మోహనన్” !

-

కేరళ హీరోయిన్‌ మాళవిక మోహనన్‌ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. మాస్టర్‌ సినిమాలో విజయ్‌ సరసన నటించి.. ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయింది మాళవిక మోహనన్. ఈ సినిమా అనంతరం.. వరుస సినిమాలలో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. వరుసగా సినిమాల ఆఫర్‌ రావడమే కాకుండా.. సోషల్‌ మీడియాలోనూ మాళవిక మోహనన్‌.. అందాల ఆరబోతతో అందరినీ వలలో వేసుకుంటుంది.

ఆమె 2013 మలయాళ చిత్రం ‘పట్టం పోల్’ మరియు 2017లో హిందీలో ‘బియాండ్ ది క్లౌడ్స్’తో సినీ రంగ ప్రవేశం చేసింది. 2019లో రజనీకాంత్ నటించిన ‘పెట్టా’తో తమిళ చిత్రాలలో ఆమె తొలిసారిగా నటించింది. ఇక ఇటీవలే మారాన్‌ సినిమాలోనూ మెరిసింది ఈ బ్యూటీ.

కాగా ఇప్పుడు మాళవిక మోహనన్‌… ప్రభాస్‌ సినిమా ఛాన్స్‌ కొట్టేసినట్లు సమాచారం అందుతోంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి ‘రాజా డీలక్స్’ అని పేరు పెట్టగా, ఇందులో ఆమె కథానాయికగా నటిస్తుందని సమాచారం. అయితే.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news