రూ.10 తో కెరియర్ ప్రారంభించి.. కోట్లు కూడబెట్టిన షారుక్ ఖాన్.. ఎన్ని కోట్లంటే..?

-

బాలీవుడ్ బాద్ షా గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ సీనియర్ హీరో షారుక్ ఖాన్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. క్రింద స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగిన ఈయన తన కెరియర్ ను కేవలం 10 రూపాయలతో మొదలుపెట్టి ప్రస్తుతం వందల కోట్లకు అధిపతి అయ్యారు. ఈ క్రమంలోనే ఈయన ఆస్తులు విలువ ఎంతో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. టీవీ సీరియల్స్ ద్వారా వెండితెరకు పరిచయమైన షారుక్ ఖాన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. హీరో అవ్వాలన్న పట్టుదలతో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు.

ఇంట్లో నుంచి ముంబై వచ్చినప్పటికీ షారుఖ్ ఖాన్ చేతిలో కేవలం పది రూపాయలు మాత్రమే ఉన్నాయి. అలా పది రూపాయలతోనే మొదలుపెట్టిన ఈయన ఇప్పుడు కోట్ల మధ్య కొలువుదీరిన ఒక స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు ఒకానొక సమయంలో తిండికి కూడా కష్టాలు పడ్డాడు. ఎన్నో ఇబ్బందులు పడి హీరోగా ఎదిగిన తర్వాత తన స్టార్ ఇమేజ్ తో పాటు కోట్ల ఆస్తులను కూడా సంపాదించాడు. ప్రస్తుతం ఇప్పటివరకు ఈయన సంపాదించిన ఆస్తులు విలువ సుమారుగా రూ. 10 వేల కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.

అలాగే ముంబైలో కోట్లు ఖరీదైన ఇల్లు షారుఖ్ ఖాన్ సొంతం. మన్నత్ పేరుతో వుండే ఈ ఇల్లు ముంబై మొత్తం మీద చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. మన్నత్ కోసం చాలామంది ట్రై చేసినా కూడా దక్కించుకోలేకపోయారు. అలాగే లండన్ లో కూడా ఒక లగ్జరీ బిల్డింగ్ ఉందట. దీని విలువ సుమారుగా 20 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. అలాగే దుబాయ్ లో కూడా షారుక్ ఖాన్ కు ఆస్తులు ఉన్నాయి . బాలీవుడ్ లో కూడా అమితాబ్ బచ్చన్ కంటే షారుక్ ఖాన్ కి ఎక్కువ ఆస్తులున్నట్లు సమాచారం. అలాగే కోట్ల రూపాయల విలువచేసే లగ్జరీ కార్లతో పాటు స్థలాలు , అపార్ట్మెంట్లు అలాగే షేర్ మార్కెట్ తో పాటు ఐపీఎల్ టీమ్ కూడా ఉంది. ఇటీవల హోటల్ రంగంలోకి దిగిన ఈయన బిజినెస్ లో వందల కోట్లు ఆర్జిస్తున్నారు. మొత్తానికి అయితే ఈయన ఆస్తులు చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news