Photoshoot: సాధారణంగా పెళ్లికి ముందు ఫ్రీ వెడ్డింగ్ షూట్ కామన్ అయిపోయింది. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్ వచ్చిన దగ్గర్నుంచి ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తూ వస్తుంది. కాగా ప్రస్తుతం మరో కొత్త ట్రెండ్ మొదలైనట్టు తెలుస్తుంది. బుల్లితెర నటి విడాకులు ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సోషల్ మీడియా కాలంలో ఏం జరిగినా వైరల్ గానే మారిపోతూ వస్తుంది. ఒక్కొక్కరు తమకు వచ్చిన ఆలోచనల్ని నెట్ ఇంట్లో ఆవిష్కరిస్తున్నారు. తాజాగా ఓ బుల్లితెర నటి పెళ్లికి మాత్రమే ఫోటోషూట్ చేసుకోవాలో అంటూ తన విడాకుల ఫోటోషూట్ ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
అసలు విషయానికి వస్తే చెన్నైకి చెందిన బుల్లితెర నటి షాలిని ముల్లమ్ సీరియళ్లు, ఓ రియాలిటీ షోలో సందడి చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఈమె గతంలో రియాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ శాలిని రియా అనే కుమార్తె కూడా ఉంది. అయితే కొన్నాళ్ల క్రితం ఈమె తన భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు అంటూ విడాకులు కోరగా కోర్టు తాజాగా వాటిని మంజూరు చేసింది.
అయితే ఈ విడాకులు తీసుకున్న నటి ఈ విషయాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఇందులో భాగంగా ఫోటోషూట్ నిర్వహించి తన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.
అంతేకాకుండా గొంతు పెగలడం లేదు అని ఫీల్ అయ్యే వారికి ఓ విడాకులు తీసుకున్న మహిళ ఇచ్చే సందేశం ఇదే అంటూ కూడా రాసుకొచ్చింది. “విడాకులు తీసుకోవడం ఒక ఫెయిల్యూర్ కాదు. విడాకులు మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి ఒక మలుపు. భర్తను వదిలిపెట్టి ఒంటరిగా జీవించాలంటే చాలా ధైర్యం కావాలి. నేను ఈ ఫోట్ షూట్‌ను ధైర్యవంతులైన మహిళలందరికీ అంకితం చేస్తున్నాను… ” అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోషూట్ చూసిన వారంతా స్ట్రాంగ్ ఉమెన్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ లైఫ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు..