Manamey Teaser : శర్వానంద్ ‘మనమే’ టీజర్ రిలీజ్

-

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మనమే’. ‘ఒకే ఒక జీవితం’ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొన్న శర్వా ఇప్పుడు ఈ సినిమాతో త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ చిత్రానికి సంబంధించి మూవీ టీమ్ టీజర్ ను రిలీజ్ చేసింది. భలే ఆసక్తికరంగా చాలా ఫన్ గా ఈ టీజర్ సాగిపోయింది. మంచిగా కనిపించే వాళ్లందరు మంచోళ్లు కాదురగా.. ఫర్ ఎగ్జాంపుల్ నేను.. మంచిగా కనిపిస్తా.. కానీ మంచోణ్నా కాదు.. అంటూ శర్వా చెప్పే డైలాగ్ తో ఈ సినిమా టీజర్ మొదలైంది.

ఇక లండన్, యూరప్ బ్యాక్​డ్రాప్​పై ఈ కథ సాగుతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. హీరో మంచివాడిగా కనిపించే బ్యాడ్​ బాయ్ అంటూ చెప్పుకుంటుండగా.. అనుకోకుండా ఆయనకు హీరోయిన్​ పరిచయమవుతుంది. వారి జీవితంలోకి ఓ బాబు వచ్చాక ఆ ఇద్దరి లైఫ్​ ఎలా సాగిందన్న విషయంపై మూవీ రూపొందుతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఆ బాబు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కుమారుడని కూడా టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version