దేవుడిని నమ్మాలంటే భక్తి ఉండాలి.. మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి.. శర్వానంద్ ‘రణరంగం’ టీజర్ అదుర్స్

ఈసినిమాను ఆగస్టులో రిలీజ్ చేయడానికి ఫిలిం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొందరికి అతడు నేరస్తుడు.. మిగిలిన వారికి హీరో అంటూ టీజర్ ప్రారంభం అవుతుంది.

టాలీవుడ్ హీరో శర్వానంద్ డాన్ పాత్రలో నటిస్తున్న సినిమా రణరంగం. సుధీర్ వర్మ ఈ సినిమాకు డైరెక్టర్. శర్వానంద్ సరసన.. కాజల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో శర్వా రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడు. ఒకటి డాన్ పాత్ర కాగా.. మరోటి 90లో జరిగిన కథలో మరో పాత్రలో నటిస్తున్నాడు.

టీజర్‌లో శర్వానంద్ చెప్పే డైలాగ్స్ బాగా పేలాయి. దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోతుంది.. కానీ మనిషిని నమ్మాలంటే మాత్రం ధైర్యం కావాలి..అంటూ శర్వా డైలాగ్ చెబుతాడు. అంతే కాదు.. కోపాన్ని, దాహాన్ని ఇంకొకడు శాసించే పరిస్థితిలో మనం ఉండకూడదు అంటూ టీజర్ చివర్లో చెప్పే డైలాగ్ అయితే కెవ్వు కేక.

ఈసినిమాను ఆగస్టులో రిలీజ్ చేయడానికి ఫిలిం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొందరికి అతడు నేరస్తుడు.. మిగిలిన వారికి హీరో అంటూ టీజర్ ప్రారంభం అవుతుంది. ప్రశాంత్ పిళ్లయి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్.