సాయి పల్లవి చేతిలో మరో హీరో బలి

-

వరుస హిట్లు పడుతున్నాయని ధైర్యమో లేక తనలాంటి నటి మరెవరు లేదన్న నమ్మకమో కాని క్రేజీ హీరోయిన్ తన యాటిట్యూడ్ తో తను చేసే ప్రతి సినిమా హీరోలు ఆమెపై ఫైర్ అవుతున్నారు. అంతేకాదు జోడి బాగుంది మరో సినిమా చేసే అవకాశాలు వచ్చినా బాబోయ్ ఆమెతో రెండో సినిమానా అంటూ వద్దనేస్తున్నారు. హీరోలకు తలనొప్పిగా మారిన ఆ హీరోయిన్ ఎవరు అంటే ఇంకెవరు ఫిదా భామ సాయి పల్లవి అంటున్నారు. మళయాళ ప్రేమం సినిమాతో సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి తెలుగులో ఫిదాతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత చేసిన ఎం.సి.ఏ కూడా హిట్ అందుకుంది. ఫిదా టైంలో అమ్మడి మీద ఎలాంటి ఆరోపణలు రాలేదు.

కాని ఎం.సి.ఏ, కణం సినిమాల టైంలో హీరోలతో గొడవలు ఆమెని రిస్క్ లో పడేశాయి. మీడియా ముందు అలాంటివేమి లేదని కలరింగ్ ఇస్తున్నా సరే ప్రస్తుతం చేస్తున్న పడి పడి లేచే మనసు సినిమాలో కూడా సాయి పల్లవి ఆ సినిమా హీరో శర్వానంద్ తో గొడవ పడుతుందట. ఇదిలాఉంటే నీది నాది ఒకే కథ డైరక్టర్ వేణు ఊడుగుల శర్వానంద్ తో విరాటపర్వం 1992 సినిమా అనుకున్నాడు. ఆ సినిమాలో హిరోయిన్ గా సాయి పల్లవిని అనుకున్నాడట. శర్వానంద్ మాత్రం ఆమె చేస్తే తాను చేయనని తెగేసి చెప్పాడట. సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా ఫిక్స్ అవడంతో ఆ ప్రాజెక్ట్ నుండి శర్వానంద్ తప్పుకోగా రానా దగ్గుబాటి ఎంట్రీ ఇచ్చాడని తెలుస్తుంది.

మరి ఎంచక్కా సినిమాలు చేస్తూ అందరితో సరదాగా ఉండక సాయి పల్లవికి ఈ గొడవల పిచ్చేంటో అని ఆమె ఫ్యాన్స్ అసహనంలో ఉన్నారు. మరి అమ్మడు తప్పు తెలుసుకుని కాస్త కెరియర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే బెటర్ లేదంటే తట్టాబుట్టా సర్ధేయాల్సే పరిస్థితి వచ్చినా రావొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version