BREAKING : కారు ప్రమాదంపై స్పందించిన శర్వానంద్

-

BREAKING : కారు ప్రమాదంపై స్పందించారు టాలీవుడ్‌ హీరో శర్వానంద్. హీరో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో హీరో శర్వానంద్ కారుకు ప్రమాదం జరుగుతుందని సమాచారం అందుతుంది.అతి వేగం కారణంగా హీరో శర్వానంద్ కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం అందుతుంది.

ఈ ప్రమాదంలో హీరో శర్వానంద్ కారు బోల్తా కొట్టింది. అయితే… కారు బోల్తాపడడంతో… హీరో శర్వానంద్ కు కొన్ని గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. అయితే.. కారు ప్రమాదంపై స్పందించిన శర్వానంద్.. ఉదయం నా కారు ప్రమాదానికి గురైందని చెప్పారు. ఇది చాలా చిన్న ఘటన అని వివరించారు శర్వానంద్‌. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో నేను ఇంట్లో పూర్తిగా సురక్షితంగా.. ఆరోగ్యంగా ఉన్నాను. ఎవరు చింతించాల్సిన పనిలేదని చెప్పారు. అందరికీ ధన్యవాదాలు అని ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు శర్వానంద్‌.

Read more RELATED
Recommended to you

Latest news