వైసీపీపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి హాట్ కామెంట్స్ చేశారు. చిత్తూరు గంగాధర నెల్లూరు మండలంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన పెద్దలు దళిత ఎమ్మెల్యేలకు జరిగిన అవమానాన్ని ఖండించకపోవడం మా దురదృష్టకరం అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బాధ్యతగా నా నియోజకవర్గం లో తిరుగుతున్నా…దళిత రిజర్వడు నియోజకవర్గ లలో చంద్రబాబు నాయుడు ఉద్దేశ పూర్వకంగా తన సామజిక వర్గం వారిచే మేము ఆ గ్రామానికి వచ్చే సమయంలో మమ్మల్ని అవమానించే విదంగా ఇల్లాకు తాళాలు వేసుకుని వెల్లమని చెప్పారని వెల్లడించారు.
ఇలా మా దళిత ఎమ్మెల్యేలను అవమానపరిచే విధంగా చేస్తున్న మా పార్టీలోని అగ్రవర్ణాలకు చెందిన వారు స్పందించకపోవడం ఆవేదన కలిగిస్తుందని ఫైర్ అయ్యారు. మా పార్టీ అగ్రవర్ణాల ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆరోపణలు చేసినప్పుడల్లా ఎస్సీ ఎస్టీలు గా చంద్రబాబును ఖండించడంలో మేమే ముందుంటామని చెప్పారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. గతంలో చంద్రబాబు ఎవరైనా ఎస్సీ గా పుట్టాలనుకుంటారా అనే భావనతో మాట్లాడారు అలాంటి భావనతో మా పార్టీకి చెందిన అగ్రవర్ణాలకు చెందిన వారు ఉన్నారేమో నాకు తెలియదు….ఇది నా వ్యక్తిగత కార్యక్రమం కాదు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో ఇలా అవమానం జరుగుతున్న దీన్ని మా పార్టీలోని వారు ఖండించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.