బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డకు ఓ యంగ్ హీరో చిరాకు తెప్పించాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ టాపిక్ ఇండస్ట్రీలో హాట్ టాపిగా మారింది. అయితే ఈ ట్వీట్ చేసిన కాసేపటికే ఆయన ట్వీట్ ను డిలీట్ చేశారు. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముందంటే..?
ఇటీవల సక్సెస్‌లో ఉన్న ఓ యంగ్ హీరో తన యాటిట్యూడ్ వల్ల మంచి హిట్ సినిమాను వదులుకున్నాడు. మనకు సక్సస్ వచ్చిన తర్వాత దానిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కానీ ఆ హీరో మాత్రం తన యాటిట్యూడ్‌తో ఓ డెబ్యూ డైరెక్టర్ కథ చెప్పడానికి వస్తే వినలేదు. ఆ హీరో తీరు తన కెరీర్‌కు ఏమాత్రం మంచిది కాదు అంటూ శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. కానీ కొంత సేపటి తర్వాత ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు.
ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరా అని నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు. అయితే చాలా మంది నెటిజన్లు విశ్వక్ సేన్ అని కామెంట్స్ చేయగా.. శోభు.. అది విశ్వక్ సేన్ మాత్రం కాదని రిప్లై ఇచ్చి క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆ హీరో ఎవరో మీకు తెలుసా..?