హీరో విశాల్‌కు షాక్.. రూ. 15 కోట్లు క‌ట్టాల‌ని మద్రాస్ హైకోర్టు తీర్పు

-

త‌మిళ స్టార్ హీరో విశాల్ కు మ‌ద్రాస్ హై కోర్టు షాక్ ఇచ్చింది. లైకా ప్రోడ‌క్షన్ సంస్థ నుంచి హీరో విశాల్ తీసుకున్న రుణానికి సంబంధించిన కేసులో మ‌ద్రాస్ హై కోర్టు విశాల్ కు షాక్ ఇచ్చింది. ఈ కేసు విషయంలో లైకా సంస్థ‌కు హీరో విశాల్ రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాల‌ని మ‌ద్రాస్ హై కోర్టు తీర్పును ఇచ్చింది. కాగ హీరో విశాల్ పై లైకా సంస్థ మద్రాస్ హై కోర్టులో పిటిషన్ వేశింది. ముందుగా చేసుకున్న ఒప్ప‌దం ప్ర‌కారం.. త‌మ నుంచి రూ. 21.29 కోట్ల అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వ‌కుండా.. వీర‌మే వాగై సుడుం అనే సినిమా ను విడుద‌ల చేయ‌డానికి సిద్ధం అయ్యాడ‌ని విశాల్ పై లైకా సంస్థ పిటిషన్ వేసింది.

అలాగే విశాల్ ఈ సినిమా శాటిలైట్, ఓటీటీ హ‌క్కుల విక్ర‌యానికి కూడా సిద్ధం అయ్యాడ‌ని పిటిషన్ లో మ‌ద్రాస్ హై కోర్టుకు తెలిపింది. వీటిని బ్యాన్ చేయాల‌ని లైకా సంస్థ త‌న పిటిషన్ లో మ‌ద్రాస్ హై కోర్టును కోరింది. కాగ పిటిషన్ పై శ‌నివారం.. మ‌ద్రాస్ హై కోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో ఈ కేసు విషయంలో విశాల్.. రూ. 15 కోట్ల ను హై కోర్టు ప్ర‌ధాన రిజిస్ట్రార్ పేరు తో బ్యాంకులో డిపాజిట్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అందు కోసం మూడు వారాల స‌మ‌యాన్ని కూడా ఇచ్చింది. అలాగే ఈ కేసు విచార‌ణ‌ను ఈ నెల 22కు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version