జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు షాకింగ్ న్యూస్…!

-

సినిమా సినిమాకు తనలో తాను మార్పులు చేసుకుంటూ అభిమానులకు, ప్రేక్షకులకు విభిన్నంగా కనిపించే ప్రయత్నం చేసే నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారు. ఇందుకు తనను తాను మార్పులు చేసుకోవడానికి, రూపం అయినా భాష అయినా, శరీర బరువు అయినా సరే పాత్రకు తగిన విధంగా మార్పులు చేసుకోవడంలో ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ముందు ఉంటాడనేది వాస్తవం.

ప్రస్తుతం తారక్ ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. హైదరాబాద్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీ౦గా నటిస్తున్నాడు. ఇద్దరి పాత్రల మీద దర్శకుడు రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ పెట్టి జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక లుక్ త్వరలో విడుదల అయ్యే అవకాశ౦ ఉందని అంటున్నారు. గడ్డంతో పాటు గుండు తో కనపడే అవకాశం ఉందని సమాచారం. ఈ పాత్రను రాజమౌళి ప్రత్యేకంగా తీర్చి దిద్దారని అంటున్నారు. ఈ లుక్ కోసం తారక్ భారీగా బరువు పెరిగాడని కూడా తెలుస్తుంది. ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్ అయిపోయిందని అందుకే త్వరలో లుక్ విడుదల చేస్తారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news