ప్రముఖ తెలుగు సింగర్ కు అసభ్య మేసేజ్ లు…!

-

ఈ రోజుల్లో సోషల్ మీడియా అందుబాటులోకి రావడం, సిని ప్రముఖుల నంబర్లు తెలియడం, వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలు తెలియడంతో కొంత మంది రెచ్చిపోతున్నారు. వాళ్లకు అసభ్యమైన కామెంట్స్ పెట్టడం, అసభ్యమైన మెసేజులు పెట్టడం వంటివి చేస్తున్నారు. ట్రోల్ చేయడానికి అర్ధం పర్ధం లేకుండా వ్యవహరిస్తున్నారు. అసభ్యమైన మాటలు మాట్లాడుతూ వారిని అనవసరంగా బాధ పెడుతున్నారు.

తాజాగా ప్రముఖ గాయని కౌశల్యని ఇదే విధంగా వేధిస్తున్నారు కొందరు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ తన బాధను ఆవేదనను బయటపెట్టారు. ఫోన్ నెంబర్ తెలుసుకుని రోజూ దరిద్రమైన మెసేజ్‌లు పంపిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. తనకు మాత్రమే కాదని, కౌసల్య మ్యూజిక్ అకాడమీలోని కొందరు అమ్మాయిలకు కూడా ఇలాంటి అసభ్యకరమైన మెసేజ్‌లు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

అందరికీ ఒకే నెంబర్ నుంచి కాల్స్, మెసేజెస్ వస్తున్నాయని, కొందరు ఆకతాయిలు కుమ్మక్కై ఇలా చేస్తున్నారనిపిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఇది ఇప్పటి సమస్య కాదు గత మూడేళ్లుగా ఈ వేధింపులను ఎదుర్కొంటున్నామని, ఓసారి ఓ కార్యక్రమం కోసం పోస్టర్లు సిద్ధం చేయించి మా నెంబర్లు కూడా ప్రింట్ చేయించామని, ఆ నెంబర్ ఆధారంగా ఇలా మెసేజ్‌లు చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

మాలాగా ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్న ప్రతీ ఆడపిల్ల పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి విషయాలపై ఫిర్యాదులు చేసేందుకు పోలీసులు ఓ వాట్సాప్ గ్రూప్ పెడితే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా ఈ వేధింపుల నుంచి బయటపడటానికి గాను ఆమె 342 నంబర్లను బ్లాక్ చేసినా సరే ఆమెకు వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news