సింగర్ ఆశాభోంస్లే ఇంటికి ఏకంగా రూ.2 లక్షల కరెంటు బిల్లు

సింగర్ ఆశాభోంస్లే ఇంటికి ఏకంగా రూ.2 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. దీనిపై మహారాష్ట్ర విద్యుత్ బోర్డుకు ఫిర్యాదు చేశారు భోంస్లే.జూన్ నెల విద్యుత్ బిల్లు రూ.2 లక్షలు రావడం వల్ల ప్రముఖ సింగర్ ఆశాభోంస్లే మహారాష్ట్ర విద్యుత్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. లోనావాలా ప్రాంతంలో ఆమెకు బంగ్లా ఉంది. జూన్ నెలలో ఆ బంగ్లా విద్యుత్ బిల్లు రూ.2,8,870 వచ్చింది. అదే బంగ్లాకు మే, ఏప్రిల్ నెలల్లో వరుసగా రూ.8,855, రూ.8,998 వచ్చాయి. దీనిపై ఫిర్యాదును స్వీకరించిన అధికారులు ఆమె బంగ్లాకు వెళ్లి విద్యుత్ మీటర్ తనిఖీ చేశారు. అనంతరం బిల్లు సరిగానే ఉందని తేల్చారు.

singer asha bosley
singer asha bosley

బంగ్లా మూసేయలేదని, అందులో షూటింగ్​లు జరుగుతున్నాయని అందుకే అంత బిల్లు వచ్చిందని తెలిపారు. సామాన్యులకు లక్షలలో కరెంట్ బిల్లులు వచ్చాయి.. కానీ విద్యుత్ శాఖ ఇలాంటి పొరపాట్లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవడంలో విఫగురవుతుంద ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలి లేకపోతే సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది.