ఖమ్మంలో కరోనా మృతుల అంత్యక్రియలకు అడ్డంకులు..?

-

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ సంక్షోభం సమయంలో బతికుండగానే కాదు మనిషి చనిపోయిన తర్వాత కూడా మనిషికి కష్టాలు వీడలేదు. మానవత్వం రోజురోజుకూ కనుమరుగు అవుతుండటం తో కనీసం అంతిమ సంస్కరణల విషయంలో కూడా ప్రశాంతత కరువైంది . కరోనా మృతుల మృతదేహాలను అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఖమ్మం జిల్లాలో తాజాగా దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

కరోనా మృతదేహాలు అంత్యక్రియలకు తీవ్ర అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ బారినపడి చికిత్స తీసుకుంటూ మరణించిన వారి మృతదేహాలకు స్థానిక స్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు స్థానికులు ఒప్పుకోవడం లేదు. కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి మృతదేహాలకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే అంతిమ సంస్కారాలు నిర్వహించారు డిమాండ్ చేస్తున్నారు, దీంతో మరణించినా కూడా ప్రశాంతత కరువైంది.

Read more RELATED
Recommended to you

Latest news