శివ కార్తికేయన్ `హీరో` సినిమా హిట్టా.. ఫ‌ట్టా..?

కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా.. కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌పై, అభిమన్యుడు ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన‌ యాక్షన్ థ్రిల్లర్ ‘హీరో’. యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మంచి అంచనాల మధ్య ఈరోజు విడుదలైన ఈ చిత్రం క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంటుంది. సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో ఎడ్యుకేషనల్ సిస్టం ను బేస్ చేసుకొని తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకొనేలా ఉందట. అయితే ఈ చిత్రంలో కథ ,డైరెక్షన్ , శివ కార్తికేయన్ నటన,యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ,విజువల్స్ పాజిటివ్ పాయింట్స్ కాగా విలన్ పాత్ర బలంగా లేకపోవడం సినిమాకు మైనస్ అయ్యిందని టాక్.

ఓవరాల్ గా ఈచిత్రం బాక్సాఫీస్ విన్నర్ అవుతుందని కోలీవుడ్ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. మ‌రి వీళ్ల అంచ‌నాల ప్ర‌కారం.. ఈ సినిమా ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి. కాగా, అబ్బుర పరిచే యాక్షన్ సీక్వెన్స్‌తో, ఫేక్ సర్టిఫికేట్ మాఫియాతో ఓ సూపర్ హీరో చేసే పోరాటమే ఈ సినిమా క‌థ‌. మ‌రియు ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు.