తానే చెప్పుకొన్న ప్రపంచ స్థాయి రాజధాని సంకల్పం.. తనకే వికటించిన పరిస్థితి. తానే ఒప్పుకొన్న .. నవ నగరాలు, నవ్య రాజధాని.. ఇప్పుడు తనకే రివర్స్ అయిన పరిస్తితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలి? అనే ప్రశ్న..ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ని వేధిస్తోంది. 2015లో అనూహ్యంగా రాజధానినిర్మాణం తెరమీదికి వచ్చింది. ఈ క్రమంలోనే చంద్రబాబు అప్పటి సీఎంగా ప్రపంచ స్థాయి నగరానికి రూపకల్పన చేశారు. నవ నగరాలు పేరుతో ఆయన పెద్ద ప్రణాళికను ప్రకటించారు. ఈక్రమంలోనే అవినీతి రహిత దేశంగా పేరు తె చ్చుకున్న సింగపూర్ నుంచి నిపుణులను ఆహ్వానించి ఏపీలో అమరావతి రాజధానికి మాస్టర్ ప్లాన్‌ను రూ పొందించారు.
అదేసమయంలో ఓ ఫైన్ ముహూర్తం చూసుకుని ప్రధాని మోడీతో ఏపీ రాజధానికి శంకు స్థాపన చేయించారు . ఇది గతం.. ఇప్పుడు కట్ చేస్తే.. వైసీపీప్రభుత్వం ఇదే రాజధానిని అడ్డు పెట్టుకుని టీడీపీని రాజకీయంగా ఫుట్‌బాల్ ఆడుతోంది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, టీడీపీ నాయకులు అనూహ్యంగా ఇక్కడ భూములు కొనుగోలు చేశారని, రాజధాని విషయంలో ప్రజలను, వ్యాపారులను తికమక పెట్టిన చంద్రబాబు.. తన వారికి మేలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ప్రభుత్వం రెండు రోజుల కిందట అసెంబ్లీలో ఏకేసింది.
గణాంక సహితంగా వివరాలను ఏకరువు పెట్టింది. దీంతో నిన్న మొన్నటి వరకు చంద్రబాబు చూపించిన అమరావతి గ్రాఫిక్స్‌ను నిజమని భావించిన వారు సైతం ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం తరఫున మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన గణాంకాలతో కూడిన ప్రసంగానికి టీడీపీ నుంచి ఏ ఒక్కరూ అభ్యంతరం చెప్పకపోవడం కూడా గమనార్హం, దీంతో మెజారిటీ ప్రజలు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. నిజంగానే టీడీపీ ఏదో చేసింది! అనే ఆలోచన చేస్తున్నారు.
అంతేకాదు, దేశంలోని ఏ రాష్ట్రానికి లేని విదంగా మనకు 8 వేల కిలో మీటర్ల నగరం అవసరమా? అనే చర్చ కూడా ఇప్పుడు సాగుతోంది. కేవలం తన వారికి చంద్రబాబు మేలు చేసుకునే క్రమంలోనే కలకత్తాను మించిన విధంగా భూ సమీకరణ చేశారని మంత్రి చేసిన ఆరోపణలపై రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో మొత్తానికి టీడీపీ బోనులో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు పరిశీలకులు.