‘మా’లో మళ్లీ మొదలైన గొడవ.. కోర్ట్ లో తేల్చుకుంటానన్న శివాజి రాజా..!

-

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా సీనియర్ హీరో నరేష్ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే మార్చి 22న మంచి ముహుర్తమని మా నూతన అధ్యక్షుడిగా నరేష్ ఆరోజున ప్రమాణ స్వీకారం చేయాలని అనుకున్నారు. అయితే మాజీ అధ్యక్షుడు శివాజి రాజా మార్చి 31 వరకు తానే అధ్యక్షుడిని అని.. అప్పటి వరకు తన కుర్చులో కూడా కూర్చోడానికి వీళ్లేదని అన్నాడట శివాజి రాజా.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ కమీషన్ కు ఫోన్ చేసి కాదు కూడదు అనుకుంటే తాను కోర్ట్ లో పిటీషన్ వేస్తా అని అన్నారట. ఈ విషయంపై మా అధ్యక్షుడు నరేష్ ప్రెస్ మీట్ పెట్టారు. ఎలాంటి గొడవలు లేకుండా చేయాలని చూస్తుంటే 31వరకు ఆగాల్సిందే అంటూ చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నాడు నరేష్. ఈ విషయాన్ని పెద్దల ముందుకు తీసుకెళ్లామని వారు ఎలా చెబితే అలా ముందుకెళ్తామని అన్నారు.

శివాజి రాజా ఎందుకు ఇలా చేస్తున్నాడు.. అతను ఎందుకు నరేష్ కు అడుగడుగునా అడ్డు పడుతున్నాడు అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా మాలో గొడవ మళ్లీ బజారుకెక్కేసరికి ఆర్టిస్టుల్లో నిజంగానే సఖ్యత లేదా అన్నది విషయంపై హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version