టాలీవుడ్ లో బోయపాటి శ్రీను తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకున్నాడు.. బోయపాటి సినిమాలు హిట్ అయినా, సరిగా ఆడకపోయినా తన స్టైల్ లోనే సినిమాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్స్ ను సృష్టించుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి.
గత సంవత్సరమే బాలయ్య తో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ని అందించిన బోయపాటి ఇప్పుడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తో స్కంద సినిమాను తెరకెక్కించారు. అయితే, రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన స్కంద సినిమా ఓటీటీలోకి వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 28న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా అక్టోబర్ 27 నుంచి డిస్నీ+హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.