బతుకమ్మ పేరు ఎలా వచ్చింది ?

-

ప్రపంచంలోనే అరుదైన పండుగ. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా పువ్వులతో…ప్రకృతితో.. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మలతో (మహిళలు/బాలికలు).. ప్రాణాధారానికి మూలాలలో ఒకటైన నీటికి సంబంధం కలిగి పంచభూతాత్మికమైన పండుగ బతుకమ్మ ప్రత్యేకత. కేవలం తెలంగాణలోనే అనాదిగా వస్తున్న పండుగ. సబ్బండ వర్ణాల వారు ప్రకృతితో మమైకమై అమ్మవారికి హృదయ పుష్పాంజలి ఘటించే పండుగ బతుకమ్మ. అలాంటి పండుగ సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభం కానున్నది. అసలు ఈ పండుగ వెనుకు ఉన్న కథలు తెలుసుకుందాం…

 

బతుకమ్మ పండుగ వెనుక చాల కథలు ఉన్నాయి. బాగా ప్రాచుర్యంలో ఉన్నదివి.. ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య , ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం బతుకమ్మా ! అని దీవించారంట అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన, బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకొనే పండుగ. స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదల పాలు కారాదనీ, పతులు మరియు కుటుంబం చల్లగా ఉండాలనీ గౌరమ్మను ప్రార్ధిస్తారు.

మరో కథ ప్రకారం.. దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానము లేక అనేక పూజలు పునస్కారాలు చేయగా ఈయన భార్య గర్భవతియై లక్ష్మీ దేవి అనుగ్రహముతో ఒక కూతుర్ని కన్నది. పసిబిడ్డైన లక్ష్మి అనేక గండములను గట్టెక్కినది కావున ఈమె తల్లితండ్రులు బతుకమ్మా అని నామకరణము చేసినారు. అప్పటినుండి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలవడము ఆన్వాయితీ అయ్యిందని ఈ కథ చెబుతున్నది.

దీన్నే మరికొందరు వేములవాడలోని శివున్ని తంజావూరుకు తరలించిన సందర్భంలో బృహదమ్మ (పార్వతీ) దేవి నుంచి శివుడినిబతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు బొడ్డెమ్మ (పసుపుతో చేసే గౌరమ్మ) ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు.

 

బతుకమ్మ 9 రోజులపాటు రోజుకు ఒక రకమైన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు తొమ్మిది రోజులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. కానీ చివరి రోజు అయినా సద్దుల బతుకమ్మ నాడు మాత్రం నైవేద్యాన్ని మహిళలే తయారుచేస్తారు.

ఎంగిలి పూల బతుకమ్మ

మహాలయ అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పించాలి.

అటుకుల బతుకమ్మ :

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి.

ముద్దపప్పు బతుకమ్మ :

ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పించాలి.

నానే బియ్యం బతుకమ్మ :

నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి.

అట్ల బతుకమ్మ :

అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పించాలి.

అలిగిన బతుకమ్మ :

ఈరోజు ఆశ్వయుజ పంచమి. ఈనాడు
నైవేద్యమేమి సమర్పించరు.

వేపకాయల బతుకమ్మ :

బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పించాలి.

వెన్నముద్దల బతుకమ్మ :

నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించాలి.

సద్దుల బతుకమ్మ :

ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదించాలి.

తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పూజించిన మహిళలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు చెరువులో నిమజ్జనం చేస్తారు. గానాబజానాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని గంగమ్మ ఒడికి చేరుస్తారు. పూలతో తయారు చేసిన బతుకమ్మ శిరస్సుపై కొలువుంచిన పసుపుతో తయారు చేసిన గౌరవమ్మను మహిళలు తమ మాంగళ్యానికి అంటే పుస్తెకు పూసుకుంటారు. దీనివల్ల తమ మాంగళ్యం అంటే తమ భర్తను ఆపదల నుంచి కాపాడి చల్లగా చూస్తుందని నమ్మకం. రొట్టె, బెల్లం లేదా చక్కెర కలిపి తయారు మాలీదను అందరికీ పంచితే శుభం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news