రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ నేటినుంచి ఐదు రోజులు సెలవుపై వెళ్లనున్నారు. ఇటీవల ఆయన సతీమణి మృతి చెందడంతో ఆయా కార్యక్రమాల కోసం వ్యక్తిగత సెలవుపై వెళ్తున్నారు. తిరిగి ఈనెల 17న విధులకు హాజరుకానున్నారు. ఈ ఐదు రోజులు జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ఎం.రాజ్ కుమార్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని డిఐజి రవికిరణ్ తెలిపారు.
కాగా, చంద్రబాబు నాయుడు అరెస్టయి దాదాపు నెల దాటింది. ఇప్పటికీ బాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆయన కుటుంబంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. తరచూ దిల్లీ పర్యటనలు చేస్తూ కేంద్రం దృష్టికి బాబు అక్రమ అరెస్టును తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బుధవారం రోజున మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను నారా లోకేశ్ కలిశారు. ఏపీ సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.