ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా స్కంద. టాలీవుడ్ మోస్ట్ హాప్పెనింగ్ హీరోయిన్ శ్రీలీల కథానాయిక. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. అయితే ఈ సినిమా అక్టోబరు 27వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుందని సదరు సంస్థ ప్రకటించింది. అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోందని రామ్ ఫ్యాన్స్ అంతా చాలా ఉత్సాహంగా ఎదురుచూశారు. కానీ, సాంకేతిక కారణాల వల్ల ఆ రిలీజ్‌ను వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ కొత్త డేట్‌ను ప్రకటించారు. ఇంతకీ ఎప్పుడు స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
నవంబరు 2వ తేదీ నుంచి స్కంద మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వస్తోంది. డిస్నీ+హాట్‌స్టార్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయం షేర్ చేసింది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘స్కంద’ అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ఇంకెందుకు ఆలస్యం ఇలా ఓటీటీలోకి రాగానే అలా ఈ సినిమాను చూసేయండి మరి.