ముందు నేనే మారాలి..విడాకుల తరవాత సమంత మొదటి పోస్ట్..!

-

టాలీవుడ్ హీరో నాగచైతన్య సమంత లు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం సమంత తన పేరును మరోసారి మార్చుకుంది. సమంత పేరు సోషల్ మీడియా లో కేవలం “ఎస్” అనే అక్షరం ఉండగా దానిపై పలు అనుమానాలు తలెత్తాయి. అయితే ఆ పేరును నిన్న సమంత గా మార్చుకుంది. ఇక తాజాగా విడాకుల అనంతరం సోషల్ మీడియాలో సమంత మొదటి సారి ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో సైడ్ విండో నుండి నగరాన్ని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో స్టోరీగా పెట్టింది. ఈ స్టోరీలో సమంత “ప్రపంచాన్ని మార్చాలి అంటే ముందు నేను మారాలి..నా పనులన్నీ నేనే చేసుకోవాలి.” అనే ఇంగ్లీష్ పాట లిరిక్స్ ను జత చేసింది. ఇక స్టోరీ చూస్తే సమంత ఎదో చెప్పాలనుకున్నట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా సమంత ప్రస్తుతం తన మూడ్ కు తగ్గట్టుగా స్టోరీ పెట్టినట్టు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news