కామెడీ ఎంటరైనర్ గా “ఆరడుగుల బుల్లెట్” ట్రైలర్

హీరో గోపిచంద్‌, నయన తార జంటగా నటిస్తున్న సినిమా అరడుగుల బుల్లెట్‌. బి. గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్దమైంది. ప్రకాశ్‌ రాజ్‌, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తుండగా… జయ బాలాజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకం పై తాండ్ర రమేష్‌ నిర్మిస్తున్నారు. ఇక ఈ అరడుగుల బుల్లెట్‌ సినిమా కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. అరడుగుల బుల్లెట్‌ సినిమా ట్రైలర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్‌ లో హీరో గోపి చంద్‌ మరియు నయన తార మధ్య జరిగిన సీన్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే.. పూర్తి కామెడీతో ఈ సినిమా నడిస్తుందని.. ఈ ట్రైలర్‌ చూస్తే.. మనకు అనిపిస్తుంది. కాగా.. చిత్రీ కరణతో పాటు నిర్మాణానంతంర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలు కారణాల కారణంగా ఇంతకాలం రిలీజ్‌ కు నోచుకోలేదు. ఈ సినిమా అక్టోబర్‌ 8 వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.

*